రవితేజ సరసన రాశి ఖన్నా..?

Ravi_teja_rashi_khanna
‘పవర్’తో రెజినాను హీరోయిన్ గా ఓ మెట్టు పైకి ఎక్కించిన మాస్ మహారాజ్ రవితేజ, ‘కిక్ 2’ సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ కు ఆ అవకాశం కల్పించారు. తాజాగా మరో యంగ్ హీరోయిన్ రాశి ఖన్నాకు లిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్నారట.

సంపత్ నంది దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించబోయే ‘బెంగాల్ టైగర్’ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నాను హీరోయిన్ గా ఎంపిక చేశారు. మరో కధానాయికగా రాశి ఖన్నాను ఎంపిక చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రవితేజ ‘కిక్ 2’ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ‘బెంగాల్ టైగర్’ షూటింగ్ ప్రారంభమవుతుంది.

‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నాకు తెలుగులో మంచి గుర్తింపు లభించింది. తర్వాత విడుదలైన ‘జోరు’ ఆశించిన విజయం సాధించకపోయినా ఈ బొద్దుగుమ్మ అందాలకు మంచి మార్కులే పడ్డాయి. రవితేజ సరసన నటిస్తే రాశి ఖన్నా దశ తిరుగుతుందని చెప్పవచ్చు. గతంలో కూడా పలువురు హీరోయిన్లను రవితేజ ఎంకరేజ్ చేశారు.

Exit mobile version