చైతూతో ఓ బ్యూటిఫుల్ లైఫ్ ఊహించుకున్న రాశి ఖన్నా

Rashi Khanna

నేడు రాశీఖన్నా పుట్టినరోజు సందర్భంగా వెంకీ మామ చిత్రబృందం ఓ స్పెషల్‌ వీడియో విడుదల చేసింది. వెంకీ మామ చిత్రంలో రాశీఖన్నా పాత్ర తీరును తెలియజేసేలా ఉన్న ఆ వీడియో ఆకట్టుకుంది. పట్నంలో బాగా చదుకొని సొంతూరికి తిరిగొచ్చిన మోడరన్ పల్లెటూరి అమ్మాయిగా రాశి ఖన్నా పాత్ర ఉంటుందని అర్థం అవుతుంది. ఇక నాగ చైతన్య-రాశి ఖన్నా లమధ్య లవ్ ట్రాక్ సినిమాకే ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం.

కె.ఎస్‌.రవీంద్ర ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వెంకటేశ్‌, నాగచైతన్య మామా అల్లుళ్లుగా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, సంపత్‌ రాజ్‌, పోసాని, రావు రమేశ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్నాయి.వెంకీ మామ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌ మరో కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన సాంగ్స్ విశేష ఆదరణ దక్కించుకున్నాయి.

Exit mobile version