ఎన్టీఆర్ సినిమాలో రాశి ఖన్నా ?

ఎన్టీఆర్ సినిమాలో రాశి ఖన్నా ?

Published on Nov 27, 2018 2:01 PM IST

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ పార్ట్స్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రాశి ఖన్నా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా రాశి ఖన్నా ఏ రోల్ లో నటిస్తోందో అని చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఆ రోజుల్లో ఎన్టీఆర్ సరసన పలు చిత్రాల్లో నటించి మెప్పించిన జయప్రద పాత్రలో రాశి ఖన్నా నటించబోతున్నట్లు సమాచారం.

కీరవాణి ఈ బయోపిక్ కి సంగీతం సమకూరుస్తున్నారు. కాగా జనవరి 9న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు