తీరికలేకుండా వరుస షూటింగ్స్ లో పాల్గొంటున్న హీరోయిన్

Rashi Khanna

హీరోయిన్ రాశి ఖన్నా పాపం తీరికలేకుండా షూటింగ్స్ లో గడుపుతున్నారు. తెలుగులో ఈమె ప్రస్తుతం వెంకటేష్, నాగచైతూ మల్టీస్టారర్ వెంకీ మామ చిత్రంతో పాటు, సాయి ధరమ్ సరసన ప్రతిరోజు పండుగే, అలాగే విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలలో నటిస్తున్నారు. మొన్న రెండు రోజులు వెంకీ మామ షూటింగ్ లో పాల్గొన్న రాశి, నిన్న ప్రతిరోజు పండగే చిత్ర షూటింగ్ లో పాల్గొన్నారట. ఇక నేడు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రీకరణలో జాయిన్ అయ్యారు. మరలా రేపు ప్రతిరోజు పండగే చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నారట. ఇలా రాశి అసలు ఊపిరి కూడా తీసుకోలేని బిజీ షెడ్యూల్స్ లో పాల్గొంటున్నారు.

ఈమె తమిళంలో విజయ్ సేతుపతి సరసన చేసిన తంగా తమిజన్ షూటింగ్ పూర్తి కాగా సైతాన్ క బచ్చా చిత్రీకరణ దశలో ఉంది. ఇలా సౌత్ లో అనేక చిత్రాలలో నటిస్తూ బిజీ హీరోయిన్ ఐపోయారు రాశి. ఏదైనా క్రేజ్ ఉన్నప్పుడే సినిమాలు చేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. ఫేడ్ అవుట్ అయ్యాక ఎంత ఆరాటపడినా చిత్రాల అవకాశాలు రావు. ఈ సూత్రాన్ని చక్కగా పాటిస్తుంది రాశి ఖన్నా.

Exit mobile version