‘చూడప్పా సిద్దప్పా’ అంటున్న రషీద్ ఖాన్ !

‘చూడప్పా సిద్దప్పా’ అంటున్న రషీద్ ఖాన్ !

Published on May 27, 2018 1:59 PM IST

అత్తారింటికి దారేది సినిమాలో ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలికిన చూడప్పా సిద్ధప్పా నేను సింహం లాంటోడిని….. అనే ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మనకు తెలిసిందే. ఇప్పుడు ఇదే డైలాగ్ ని ఐపీల్ స్టార్ హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు తరుపున ఆడుతున్న ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ ప్లేయర్ రషీద్ ఖాన్ తనకు వచ్చి రాని తెలుగులో చెప్పి అభిమానుల మనుసు గెలుచుకున్నాడు . రషీద్ పలికిన ఈ డైలాగ్ కాస్త ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది .

మొన్నజరిగిన ఐపీఎల్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో హైదరాబాద్ ని ఒంటి చేత్తో ఫైనల్ కి చేర్చిన తరువాత రషీద్ ఖాన్ ఓవర్ నైట్ లోనే స్టార్ గా మారాడు . అంతేగాక ఈ విజయాన్న అందించినందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రషీద్ ఖాన్ ని ప్రశంసించాడు . బదులుగా రషీద్ మహేష్ కు థ్యాంకు బ్రదర్ నేను మీ సినిమాలు చూస్తానని రిప్లై ఇవ్వడం నిన్న వైరల్ అయింది . తాజాగా మరో స్టార్ హీరో డైలాగ్ తో రషీద్ ఖాన్ తెలుగు వారికీ మరింత దగ్గరయ్యాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు