రాశి ఖన్నా ఫోటో చూసి క్యాప్షన్ అంట ఇవ్వండయ్యా

రాశి ఖన్నా ఫోటో చూసి క్యాప్షన్ అంట ఇవ్వండయ్యా

Published on Sep 27, 2019 5:37 PM IST

Rashi Khanna

రాశి ఖన్నా తెలుగులో వరుసబెట్టి చిత్రాలు చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం వెంకటేష్ నాగ చైతన్య నటిస్తున్న వెంకీ మామ చిత్రంతో పాటు, విజయ్ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ అలాగే సాయి ధరమ్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిరోజు పండుగే చిత్రాలలో నటిస్తున్నారు. వీటిలో వెంకీ మామ వచ్చే నెలలో విడుదల కానుంది. ఇక సాయి ధరమ్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

కాగా వెంకీ మామ చిత్ర షూటింగ్ సెట్స్ లోని ఓ ఫోటోని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన రాశి ఆ ఫోటోకి క్యాప్షన్ ఇవ్వాల్సిందిగా కోరింది. లేడీ కమెడియన్ విద్యు రామన్ చెవుతున్న విషయాన్ని విని షాక్ కి గురైనట్లున్న ఆమె పోజ్ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో నడిచే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఎస్ ఎస్ థమన్ అందిస్తున్నారు. దసరా కానుకగా విడుదల చేయాలని భావించినా, ఎందుకో విడుదల వాయిదా వేశారు.

https://www.instagram.com/p/B251OTnhQLI/?utm_source=ig_web_button_share_sheet

సంబంధిత సమాచారం

తాజా వార్తలు