‘వ్యూహం’తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రేష్మి

‘వ్యూహం’తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రేష్మి

Published on Jan 17, 2015 10:21 PM IST

rashmi
జబర్దస్త్ కామెడీ షో తో బుల్లితెర తెలుగు ప్రేకశాకులకు హాట్ యాంకర్ గా రేష్మి గౌతం పరిచయస్తురాలే. అయితే ఇప్పుడు ఈ భామ ‘వ్యూహం’ అనే చిత్రం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇప్పటికే పోస్టర్లు ప్రచార మాధ్యమాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ సినిమాలో రేష్మికి మంచి పాత్ర లభించిందని సమాచారం.

ఇప్పటికే పలు సినిమాలలో నటించిన రేష్మికి చెప్పుకోదగ్గ విజయం దక్కలేదు. ఇప్పుడు ఈ సినిమాలో తన పాత్రపై ఈ భామ భారీగానే ఆశలు పెట్టుకుంది. తను ఆశిస్తున్నట్టుగానే ఈ సినిమా మంచి విజయం సాధించాలని, ఆ విజయం తనకి మరిన్ని సినిమాలు తెచ్చిపెట్టాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు