రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘రేష్మి గౌతమ్’ కొత్త సినిమా

rashmi
‘జబర్దస్త్’ కామెడీషోతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన యాంకర్ ‘రేష్మి గౌతమ్’ ప్రస్తుతం హీరోయిన్ గా సక్సెస్ బాటలో దూసుకుపోతోంది. దర్శకుడు ‘ప్రవీణ్ సత్తారు’ తెరకెక్కించిన ‘గుంటూరు టాకీస్’ సినిమాలో రేష్మి స్క్రీన్ ప్రెసెన్స్ కు కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో రేష్మి మాస్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. ప్రస్తుతం ఈమె ఓ రొమాంటిక్ హర్రర్ చిత్రం ‘తను వచ్చెనంట’ లో లీడ్ రోల్ చేస్తోంది.

‘చంద్రశేఖర్ ఆజాద్’ నిర్మాతగా శ్రీ అచ్యుత ఆర్ట్స్ పతాకంపై ‘వెంకట్ కాచర్ల’ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇటీవలే రిలీజైన ఈ చిత్రం టీజర్ కు మంచి స్పందనే వస్తోంది. ఇకపోతే ఈ చిత్రం ఆగష్టు 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రేష్మి గ్లామర్ రోల్ తో పాటు ఓ ‘జాంబీ’ గానూ అలరించనుంది.