రష్మిక మేకప్ లేకుండా నటిస్తుంది !

రష్మిక మేకప్ లేకుండా నటిస్తుంది !

Published on Aug 17, 2018 9:42 PM IST


‘ఛలో’ చిత్రం తో తెలుగు తెరకు పరిచియమైన కన్నడ హీరోయిన్ రష్మిక మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి తెలుగులోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈచిత్రంతరువాత విజయ్ దేవరకొండతో గీత గోవిందం అనే చిత్రంలో నటించింది. ఇటీవల విడుదలైన ఈచిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇలా తెలుగులో నటించిన రెండు చిత్రాలు సూపర్ హిట్ సాధించడంతో ఆమె నటించే తదుపరి చిత్రాలపై అంచనాలు పెరిగాయి.

ఇక ప్రస్తుతం ఆమె మళ్లీ విజయ్ దేవరకొండ తోనే ‘డియర్ కామ్రేడ్’ అనే చిత్రంలో నటిస్తుంది. ఈచిత్రంలో ఆమె మేకప్ లేకుండా నటిస్తుందట. ఈ విషయాన్నిరష్మిక ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో వెల్లడిచింది. నూతన దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో రష్మిక క్రికెటర్ పాత్రలో కనిపించనుంది. మైత్రి మూవీ మేకర్స్ ,బిగ్ బెన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక రష్మిక ఈచిత్రంతో పాటు నాగ్ ,నానిల మల్టీ స్టారర్ ‘దేవదాస్’ చిత్రంలో నాని కి జోడిగా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు