ఛలో బ్యూటీ తమిళ చిత్రం లాంచ్ !

Published on Mar 15, 2019 3:15 am IST

కన్నడ బ్యూటీ రష్మిక కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. తమిళ హీరో కార్తీ తో ‘రెమో’ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ ఓ సినిమా తెరకెక్కించనున్నాడు. ఇందులో రష్మిక కథానాయికగా నటించనుంది.

ఈసినిమా నిన్న గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. డ్రీం వారియర్ పిక్చర్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది. మరి ఈ చిత్రం తో హిట్టు కొట్టి రష్మిక అక్కడ బిజీ అవుతుందో లేదో చూడాలి. ఇక ప్రస్తుతం ఆమె తెలుగులో విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ లో నటిస్తుండగా ,నితిన్ భీష్మ సినిమాకి కూడాసైన్ చేసింది. అలాగే కన్నడలో కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More