అల్లు అర్జున్ ఫేవరేట్ సాంగ్ పై రష్మీక కామెంట్స్!

Rashmika Mandanna

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి మాస్ సాంగ్ అయిన ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా పాట కి సంబంధించిన అప్డేట్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. నవంబర్ 19 వ తేదీన ఈ పాటను చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. అయితే ఈ పాట పై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది తన ఫేవరేట్ సాంగ్ అని, ఈ పాట కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న రష్మీక మందన్న స్పందించడం జరిగింది.

ఇది సూపర్ గా ఉండనుంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ పాట కోసం ఎదురు చూడలేను అని అన్నారు. ఇప్పటి వరకూ విడుదల అయిన పాటలు సోషల్ మీడియా లో వైరల్ కాగా, యూ ట్యూబ్ లో భారీ వ్యూస్ దక్కించుకున్నాయి. ఈ పాట పై ఈ తరహాలో కామెంట్స్ వస్తుండటం తో ఇది వేరే లెవెల్ లో ఉండే అవకాశం ఉంది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version