ఓన్ డబ్బింగ్ చెప్పుకోబోతున్న క్రేజీ హీరోయిన్ !

Published on Aug 26, 2018 11:15 am IST

‘ఛలో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక మందన్న, ‘గీత గోవిందం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. గీత పాత్రలో ఆమె నటన అన్ని వర్గాల ఆడియన్స్ ను అక్కట్టుకున్నేలా ఉంది. ముఖ్యంగా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన గ్లామర్ తోనూ గీత గోవిందం చిత్రం విజయంలో ముఖ్య భూమిక పోషించింది రష్మిక. అయితే తాజాగా ఆమె మొదటి సారిగా తెలుగులో డబ్బింగ్ చెప్పబోతుంది.

ప్రస్తుతం రష్మిక ‘దేవదాస్’, ‘డియర్ కామ్రేడ్’ లాంటి క్రేజీ చిత్రాలతో బిజీగా ఉంది. కాగా దేవదాస్ చిత్రానికి డబ్బింగ్ చెప్పడానికి ఆమె సన్నద్ధం అవుతుందట. రష్మిక ‘గీత గోవిందం’ చిత్రానికే డబ్బింగ్ చెప్పాలనుకున్నప్పటికీ డేట్స్ ఎడ్జిస్ట్ కాక ఆ సినిమాకి డబ్బింగ్ ఆర్టిస్ట్ తో చెప్పించారు. ‘దేవదాస్’కు మాత్రం ఆమె డబ్బింగ్ చెప్పడానికి ముందు నుంచే ప్రిపేర్ అవుతుంది. ఈ సినిమా కూడా భారీ విజయాలు సాధిస్తే ఇక రష్మిక మందన్న తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయినట్లే.

సంబంధిత సమాచారం :

X
More