మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో తన టాక్సీవాలా దర్శకుడు రాహుల్ కాంబినేషన్ లో చేస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ కూడా ఒకటి.
ఈ చిత్రంలో నేషనల్ క్రష్, తన భార్య రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుండగా రష్మిక మందన్నా స్టోరీ ఒకటి ఫ్యాన్స్ లో కేజ్రీగా వైరల్ అవుతుంది.
ఓ సీక్వెన్స్ కి సంబంధించి విజయ్ పై తీసిన ఫోటో ఒకటి రష్మిక షేర్ చేసి దీనిని నేను చూపించవచ్చో లేదో లేదా నన్ను ఇది తీసేయమంటారో ఏమో కానీ ఈ బాయ్స్(విజయ్ దేవరకొండ, డైరెక్షన్ టీం) ఒక భయానక వర్క్ చేస్తున్నారు అది బిగ్ స్క్రీన్స్ పై చూసేందుకు ఎదురు చూడలేకపోతున్నాను, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని రష్మిక తెలిపింది.
దీనితో రణబాలి లో ఆ మ్యాడ్ సీక్వెన్స్ కోసం ఇపుడు చర్చగా మారింది. ఇక ఈ చిత్రానికి అజయ్, అతుల్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ గా ఈ పీరియాడిక్ డ్రామాని తెరకెక్కిస్తున్నారు.



