ఇంటర్వ్యూ : రష్మిక మండన్నా – నాగ్ సార్ అండ్ నానిగారి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది.

Published on Sep 22, 2018 6:01 pm IST

నాగార్జున, నాని కలిసి నటిస్తున్న చిత్రం ‘దేవదాస్’. ‘భలే మంచి రోజు’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మండన్నా, ఆకాంక్ష సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకం అశ్వినిదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 27న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర హీరోయిన్ రష్మిక మండన్నా మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

గీత గోవిందంలో మీ పాత్ర హీరోకి సమానంగా ఉంటుంది. మరి ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?

ఇది గీత గోవిందం కథ కాదండి. దేవ అండ్ దాస్ కథ. వారి గురించి మాత్రమేఎక్కువ ఉంటుంది. నాగ్ సార్ అండ్ నానిగారి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. వారి మధ్య సీన్స్ చూసి నేనే చాలా థ్రిల్ అయ్యాను. ఇక అభిమానులు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. నా వరికి వస్తే ఈ సినిమాలో పూజ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. నాకు నా క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది. చాలా లవ్ చేసి చేశాను. నేను చేసిన గత సినిమాల్లోని క్యారెక్టర్స్ కంటే.. ఈ సినిమాలో నా క్యారెక్టర్ వైవిధ్యంగా ఉంటుంది.

ఈ సినిమాలో నాగార్జునగారు, నానిగారితో కలిసి పని చేశారు. మీకెలా అనిపించింది. ఆ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పండి ?

నాగ్ సర్ తోటి చాలా తక్కువ రోజులు వర్క్ చేశాను అండి. కేవలం టు డేస్ మాత్రమే చేశాను. కానీ ఆ టు డేస్ నవ్వుతానే ఉన్నాను. ఆయన చాలా చాలా హ్యాపీ పర్సన్. నాగ్ గారితో వర్క్ చెయ్యటం నిజంగా మర్చిపోలేని ఓ మంచి అనుభూతి. ఇక నానిగారితో వర్క్ చెయ్యటం నాకు చాలా లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్. అంటే సీన్ లో కావొచ్చు, డైలాగ్స్ లో కావొచ్చు నానిగారు ఎప్పుడు ఏమేమి ఇంప్రూవ్ చెయ్యొచ్చు అని చూస్తుంటారు. నాకు ఏమైనా అర్ధం కాకపోయినా నానిగారినో లేక డైరెక్టర్ గారినో అడిగేదాన్ని. నానిగారు అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు.

మీ మొదటి రెండు చిత్రాలు “ఛలో”, “గీత గోవిందం” మంచి హిట్ అయ్యాయి. ఈ సినిమా మీకు హ్యాట్రిక్ ఫిల్మ్ అవుతుందా ?

ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే ఇది మల్టీస్టారర్ మూవీ. భారీ సక్సెస్ అవుతుంది. సినిమా అంత చాలా ఎంటర్టైన్ గా ఉంటుంది. మీరు అంతా మూవీ బాగా ఎంజాయ్ చేస్తారు.

‘వైజయంతి మూవీస్’ లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో పని చెయ్యడం ఎలా అనిపించింది ?

గీత గోవిందం మూవీ రిలీజ్ కి ముందే నాకు ఈ మూవీ ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ స్వప్న మ్యాడమ్ ని వచ్చి కలిసాను. కానీ పెద్ద ప్రొడక్షన్ హౌస్ కదా పైగా మల్టీస్టారర్. నన్ను సెలెక్ట్ చేస్తారా లేదా అని చాల టెన్షన్ పడ్డాను. ఆ తర్వాత చిన్న ఆడిషన్ ఇచ్చాను. పూజ క్యారెక్టర్ లో నన్ను ఫైనల్ చేసారు.

మీ తదుపరి చిత్రాలు గురించి చెప్పండి ?

ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ మూవీలో చేస్తున్నాను. ఇంకా కొన్ని మూవీస్ డిస్కర్షన్స్ లో ఉన్నాయి. అలాగే కన్నడంలో యజమాన అనే ఒక మూవీలో యాక్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ ఆ మూవీలో నా క్యారెక్టర్ కి నేనే డబ్బింగ్ చెబుతున్నాను.

సంబంధిత సమాచారం :