కేరళ అడవుల్లో ‘మైసా’ యాక్షన్.. సాలిడ్ అంటోన్న మేకర్స్..!

కేరళ అడవుల్లో ‘మైసా’ యాక్షన్.. సాలిడ్ అంటోన్న మేకర్స్..!

Published on Apr 27, 2026 11:33 PM IST

నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మైసా’ షూటింగ్ ప్రస్తుతం కేరళలోని దట్టమైన అడవుల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ ఎంత ఉధృతంగా సాగుతుందో తెలియజేస్తూ రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసిన బిహైండ్ ది సీన్స్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా ఈ షెడ్యూల్ “సూపర్ బ్లడీ”గా సాగుతోందని రష్మిక పేర్కొనడం సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ చిత్రంలో ఆమె మునుపెన్నడూ చూడని ఒక పవర్‌ఫుల్ మరియు యాక్షన్ ఓరియెంటెడ్ రోల్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. కేరళ లొకేషన్లలో చిత్రీకరిస్తున్న ఈ యాక్షన్ సీక్వెన్సులు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది.

‘పుష్ప-2’ తర్వాత రష్మిక నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులలో ఇది ఒకటి కావడంతో, అటు సినీ వర్గాల్లోనూ ఇటు అభిమానుల్లోనూ ‘మైసా’పై విపరీతమైన ఆసక్తి నెలకొంది. వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం రష్మిక కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని రవీంద్ర పుల్లె డైరెక్ట్ చేస్తుండగా పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు