ఈ వీకెండ్ ఓటీటీలో మాయ చేయనున్న రష్మిక.. ఒకటి కాదు రెండు..!

Thamma-and-The-Girlfriend

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ వీకెండ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఆమె నటించిన రెండు సినిమాలు ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడి చేయబోతున్నాయి. దీంతో రష్మిక ఫ్యాన్స్ ఆమె చిత్రాలను ఈ వీకెండ్ టాప్ ప్రయారిటీ గా పెట్టుకున్నారు. బాలీవుడ్‌లో వచ్చిన ‘థామా’ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించిన రష్మిక ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఇప్పటికే ప్రైమ్ వీడియోలో రెంట్ బేసిస్‌లో అందుబాటులోకి రావడం విశేషం.

మరోపక్క టాలీవుడ్ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాతో రష్మిక ఎలాంటి రెస్పాన్స్ అందుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సినిమాలో రష్మిక తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

ఇలా ఈ వీకెండ్‌లో రష్మిక రెండు చిత్రాలు కూడా ఓటీటీల్లో సందడి చేయనుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో తమ అభిమాన నటి సినిమాలను మిస్ అయినవారు ఈ వీకెండ్ ఓటీటీలో వాటిని చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

Exit mobile version