రష్మికకు విజయ్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు

రష్మికకు విజయ్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు

Published on Jul 18, 2019 7:00 AM IST

టాలీవుడ్ ఆన్ స్క్రీన్ క్రేజీ జంటల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల జోడీ కూడా ఉంది. వీరిద్దరూ కలిసి ‘గీత గోవిందం’ చిత్రంలో చేసిన మ్యాజిక్ ఇప్పటికీ ప్రేక్షకులకు బాగా గుర్తుంది. ఈ చిత్రంతో వీరిద్దరూ స్టార్ నటీ నటులుగా ఎదిగారు. వీరు రెండోసారి జోడీకట్టి నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. వీరి పెయిర్ మూలానే సినిమాకు క్రేజ్ విపరీతంగా ఉంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడంతో వీరిద్దరూ బయట మంచి స్నేహితులయ్యారు.

ఎంతలా అంటే విజయ్ తన బట్టల బ్రాండ్ రౌడీ వేర్ నుండి కొత్తగా అమ్మాయిల కోసం కూడా బట్టల్ని లాంచ్ చేయనున్నాడు. వీటిని తనకు మంచి ఫ్రెండ్ అయిన రష్మిక చేతులు మీదుగా రిలీజ్ చేయించాలని భావిస్తున్నాడట విజయ్. దీన్నిబట్టి విజయ్ రష్మికకు ఏ స్థాయి ప్రాధాన్యం ఇస్తున్నాడో అర్థమవుతోంది. ఇకపోతే వీరి ‘డియర్ కామ్రేడ్’ చిత్రం జూలై 26న ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు