ఇలా ఎవ్వరూ రిస్క్ తీసుకోవద్దు – రష్మిక

Published on Jun 28, 2021 11:14 pm IST

రష్మిక మండన్నా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కి రిక్వెస్ట్ పెడుతూ.. “దయచేసి నన్ను చూసేందుకు వందల కిలోమీటర్లు ఎవ్వరూ ప్రయాణం చేయొద్దు. అది నన్ను ఎంతగానో బాధిస్తోంది. కాబట్టి దయచేసి అలాంటి పనులు ఎవ్వరు చేయొద్దు. నా కోసం వందల కిలోమీటర్ల దూరం నుండి వచ్చిన ఓ అభిమానిని నేను కలవలేకపోయాను. ఈ విషయం నాకు ఆలస్యంగా తెలిసింది.

అయితే అతన్ని ఇప్పుడు కలవకలేక పోయినా వీలు అయితే భవిష్యత్తులో కలుస్తానని అనుకుంటున్నా. కానీ ఇలా ఎవ్వరూ రిస్క్ తీసుకోవద్దు’ అంటూ రష్మిక పోస్ట్ చేసింది. ఇటీవల రష్మికని చూసేందుకు తెలంగాణాకి చెందిన ఒక కుర్రాడు కర్ణాటకలోని రష్మిక ఇంటికి వెళ్ళాడు.

ఆమె ఇంటి చుట్టూ అనుమానంగా తచ్చాడుతున్నాడని రష్మిక సిబ్బంది నుండి పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు వచ్చి ఆ కుర్రాణ్ణి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆ కుర్రాడిని అక్కడి నుండి పంపించారు.

సంబంధిత సమాచారం :