అట్లీ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ తన 63వ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక నటించనుందని ఇటీవల వార్తలు వచ్చాయి కానీ ఈచిత్ర మేకర్స్ లేడీ సూపర్ స్టార్ నయనతార ను హీరోయిన్ గా ప్రకటించడంతో అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. ఇక ఈవార్తలపై ఎట్టకేలకు రష్మిక స్పందించింది.
విజయ్ -అట్లీ కాంబినేషన్లో రానున్న తలపతి 63 మూవీ లో నటిస్తున్నారా అని చాలా మంది నన్ను అడిగారు. కానీ ఈ సారి నాకు ఆ ఛాన్స్ రాలేదు. కానీ నెక్స్ట్ టైం ఈ అవకాశం వస్తుందని భావిస్తున్నాను. త్వరలోనే ఖచ్చితంగా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తానని రష్మిక క్లారిటీ ఇచ్చింది. ఇక ఆమె ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘డియర్ కామ్రేడ్’ అనే చిత్రంలో నటిస్తుంది.


