మీకు ఆ హక్కు లేదంటూ విరుచుకుపడిన రష్మిక

మీకు ఆ హక్కు లేదంటూ విరుచుకుపడిన రష్మిక

Published on Nov 8, 2019 1:00 AM IST

Rashmika1

తెలుగులో ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న హీరోయిన్ ఎవరంటే అనుమానం లేకుండా రష్మిక మందన్న అని చెప్పొచ్చు. ప్రస్తుతం మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్ జోడీగా ‘భీష్మ’ అనే సినిమాలు చేస్తున్న ఆమె అల్లు అర్జున్, సుకుమార్ సినిమాలో కూడా ఫైనల్ అయింది. దీంతో దక్షిణాదిన ఆమె పేరు మారుమోగి పోతోంది. ఈ పేరుతో పాటు ఆమెపై సోషల్ మీడియా ట్రోలింగ్స్ కూడా పెరుగుతున్నాయి.

ఇన్నాళ్ళు వాటిని పట్టించుకోని రష్మిక తాజాగా తన చిన్నప్పటి ఫొటోలను పెట్టి కొందరు ట్రోలింగ్ చేయడాన్ని మాత్రం తీవ్రంగా ఖండించారు. సెలబ్రిటీలు సాఫ్ట్ టార్గెట్స్ అని ట్రోలింగ్ చేస్తున్నారా అంటూ స్టార్ట్ చేసిన ఆమె పబ్లిక్ ఫిగర్స్ అంటే మీరు నిర్దయగా టార్గెట్ చేయడానికి ఉన్నవారు కాదు. మా పని గురించి మాట్లాడే హక్కు మీకుంది కానీ మా వ్యక్తిగత జీవితాల గురించి, కుటుంబాల గురించి మట్లాడే హక్కు మీకు లేదు. ప్రతి పనికి గౌరవం అవసరం. మొదట అవతలివారిని గౌరవించటం నేర్చుకోండి అంటూ గట్టి క్లాస్ పీకారు.

రష్మిక ఇలా ఫైర్ అవడం పట్ల ఆమె అభిమానులు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియా ట్రోలింగ్ చేసేవారికి ఇలానే సమాధానం ఇవ్వాలని ఆమెను సమర్థిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు