రష్మిక కు గోల్డెన్ ఛాన్స్ ?

రష్మిక కు గోల్డెన్ ఛాన్స్ ?

Published on Nov 19, 2018 3:07 PM IST

తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించనున్న 63వ చిత్రం ఇటీవల గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. అట్లీ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో విజయ్ సరసన యువ హీరోయిన్ రష్మిక మండన్న నటించనున్నట్లుగా చెన్నై చిత్ర వర్గాల నుండి సమాచారం వస్తుంది. మరి ఈ వార్తే నిజమైతే రష్మిక కు గోల్డెన్ ఛాన్స్ దక్కినట్లే అయితే ఈ వార్త ఫై అధికారిక ప్రకటన వెలుబడాల్సి వుంది.

భారీ బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించనున్న ఈ చిత్రానికి ఎఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ‘తేరి, మెర్సల్’ చిత్రాల తరువాత విజయ్ -అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ మూడవ చిత్రంఫై భారీ అంచనాలు ఉన్నాయి. ఈచిత్రం వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు