గోవింద్ కు శుభాకాంక్షలు తెలిపిన గీత !
Published on Jun 20, 2018 7:24 pm IST


అర్జున్ రెడ్డి చిత్రానికి గాను ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డును గెల్చుకున్న విజయ్ దేవరకొండ కు నటి రష్మిక మండన్న శుభాకాంక్షలు తెలిపింది . ఇందులో ప్రత్యేకత ఏమిటంటే వాళ్లిదరు కలిసి పరుశురాం దర్శకత్వంలో గీతా గోవిందం అనే సినిమాలో నటిస్తున్నారు . ఈ రోజే ఈ చిత్ర టైటిల్ ను ప్రకటించారు .ఈ చిత్రంలోని గీత పాత్రలో రష్మిక నటిస్తుండగా గోవింద్ పాత్రలో విజయ్ నటిస్తున్నాడు . ఇక ఈ పేరుతోనే రష్మిక ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చిందంట కదా కంగ్రాట్స్ గోవింద్ అని ట్విట్టర్లో పోస్ట్ చేసింది . దీనికి విజయ్ కూడా థాంక్స్ గీత గారు అవార్డులు వస్తుంటాయి పోతుంటాయి కాని మీతో సమయాన్ని గడపడం నాకు నిజమైన అవార్డు అని రిప్లై ఇచ్చారు .

ఇక ఈ గీత గోవిందం చిత్రాన్ని గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook