ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన రష్మిక మండన్నా !

Published on Aug 15, 2019 3:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్ లో మహేష్ తో పాటు రష్మిక మండన్నా, రాజేంద్ర ప్రసాద్, విజయశాంతి అలాగే కొంతమంది ముఖ్య తారాగణం కూడా పాల్గొన్నారు. అయితే రష్మిక మండన్నా ఈ సినిమాలో తన పార్ట్ కి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసింది.

ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ గురించి రష్మిక ట్వీట్ చేస్తూ.. “అమేజింగ్ పీపుల్.. సినిమాలో చాలా నవ్వులు – స్వచ్ఛమైన నవ్వులు ఉన్నాయి” అని అర్ధం వచ్చేలా పోస్ట్ చేసింది. ఇక ఈ సినిమాలో విజయశాంతి క్యారెక్టర్ చాల కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :