ప్రజలు ఆదరించారు అదే పెద్ద అవార్డు అంటున్న హీరో

Published on Aug 19, 2019 3:25 pm IST

గత ఏడాది అక్టోబర్ లో విడుదలైన తమిళ చిత్రం రాత్ససన్ మంచి విజయాన్ని అందుకుంది. సీరియల్ సైకో కిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, అమలా పాల్ జంటగా నటించారు. దర్శకుడు రామ్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం సమకూర్చగా, ఎక్స్ ఎస్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించారు.

కాగా చిత్రంలోని హీరోగా నటించిన విష్ణు విశాల్ ఓ ఆసక్తికరమైన విషయాన్నీ ట్వీట్ చేశారు. ఇటీవలే జాతీయ ఫిలిమ్స్ అవార్డ్స్ తో పాటు, సైమా అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. ఐతే ఈ రెండు అవార్డ్స్ వేడుకలలో రాత్ససన్ మూవీ ఒక్క కేటగిరీలో కూడా నామినేట్ కాలేకపోయింది. దీనికి ఒకింత నిరాశ చెందిన హీరో విష్ణు విశాల్ ” తాజాగా ప్రకటించిన అవార్డ్స్ లో కూడా రాత్ససన్ మూవీ ఒక్క విభాగంలో కూడా నామినేట్ కాలేదు, ప్రజల ఆదరణ కంటే అతిపెద్ద అవార్డు ఏముంటుంది, మీరు మా చిత్రంపై చూపిన ప్రేమకి కృతఙ్ఞతలు” అని ట్వీట్ చేసి, చిత్ర దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్, ఎడిటర్ సాన్ లోకేష్ ని కొనియాడారు.

ఈమూవీని తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు పేరుతో రీమేక్ చేసి విజయం అందుకున్నారు.తెలుగులో ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహించగా, అనుపమ పరమేశ్వరన్, రాజీవ్ కనకాల ముఖ్యపాత్రాలలో నటించారు.

సంబంధిత సమాచారం :