దర్శకడు రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రం ‘అదుగో’. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పందిపిల్ల కావడంతో ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం పై ఆసక్తి పెరుగుతూ వస్తోంది. పైగా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో వస్తుండటంతో ‘అదుగో’ మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు కూడా ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది.
కాగా ఈ చిత్రాన్ని నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దాంతో చిత్రబృందం ప్రమోషన్ లో భాగంగా వినూత్న ప్రచార కార్యక్రమాలతో ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా పందిపిల్లతో పాదయాత్ర నిర్వహించడానికి వెళ్తున్నారు. హైదరాబాద్ కె.బి.ఆర్ పార్క్ నుంచి ఫిలించాంబర్ వరకు పాదయాత్ర చేయనున్నారు. రేపు సాయంత్రం 3:30 గంటలకు ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది.


