
‘అల్లరి’ చేస్తూ తెలుగు ప్రేక్షకులకి పరిచయమై ఆ అల్లరినే ఇంటిపేరుగా మార్చుకున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్ మరోసారి తన ఇండస్ట్రీకి పరిచయం చేసిన రవిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే మొదలైంది. తన సినిమాలకు రొటీన్ కి భిన్నంగా టైటిల్స్ ఎంచుకునే రవిబాబు ఈ సినిమాకి ‘లడ్డూబాబు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఈ సినిమాలో ఒకప్పుడు టాప్ హీరోల సరసన నటించిన భూమిక ఓ కీలక పాత్రలో కనిపించనుంది. చక్రి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని త్రిపురనేని రాజేంద్ర నిర్మిస్తున్నాడు. కామెడీని తెరపై ఆవిష్కరించడంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్న రవిబాబు – కామెడీ కింగ్ గా పేరుతెచ్చుకున్న అల్లరి నరేష్ కాంబినేషన్లో చాలా కాలం తర్వాత వస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ఎలా ఉంటుందా అని నరేష్ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.
‘లడ్డూబాబు’గా అలరించనున్న అల్లరి టీం
‘లడ్డూబాబు’గా అలరించనున్న అల్లరి టీం
Published on Jun 23, 2013 5:30 PM IST
సంబంధిత సమాచారం
- ఎన్టీఆర్ పేరుతో చారిటీ.. టీమ్ ఇచ్చిన క్లారిటీ..!
- కెవిన్ఎన్ వారి డబుల్ స్ట్రాటెజీ.. టాక్సిక్‌తో పాటే జన నాయగన్..?
- ఏక్ దిన్ ఎఫెక్ట్ : ‘రామాయణ’ కోసం సాయి పల్లవి ఆ పని చేయబోదు..!
- నిర్మాతల వాదనపై వైజయంతి మూవీస్ రెస్పాన్స్ ఇదే..!
- వాయిదా పర్వంలో ‘జైలర్ 2’.. కొత్త డేట్ వెతుకుతున్న రజినీ..!
- టాలీవుడ్ స్టార్స్ రూటు మార్చాల్సిన టైం వచ్చిందా? ప్రభాస్ ఎప్పుడో ప్లాన్ చేసాడు కానీ
- బన్నీ, లోకేష్ ప్రాజెక్ట్ లో బుట్టబొమ్మతో పాటు ‘జాట్’ బ్యూటీ?
- శర్వా, శ్రీను వైట్ల ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
- ఫోటోలు : పూజా హెగ్డే
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘దేవర’లో సగం డ్యూటీ కూడా ‘పెద్ది’కి లేదుగా!
- దృశ్యం-3 : తెలుగులోనూ మోహన్ లాల్ సస్పెన్స్ థ్రిల్లర్.. మరి వెంకటేష్..?
- నార్త్‌లో పెద్ది ప్రభంజనం.. ముంబై వేదికగా ట్రైలర్ లాంచ్‌తో విధ్వంసం..!
- మొత్తం మార్చేసిన విజయ్.. ‘జన నాయగన్’కి మళ్ళీ భారీ ఓటిటి ఆఫర్స్!?
- టాలీవుడ్లో సింగిల్ స్క్రీన్ల మనుగడ ప్రశ్నార్థకం: పర్సంటేజీ సిస్టమ్ అమలు చేయాలంటూ తెలంగాణ ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి
- రవితేజ ‘ఇరుముడి’పై లేటెస్ట్ రిపోర్ట్!
- పెద్ది కథకు ప్రాణం పోయనున్న అప్పల సూరి..?
- బాబీ సినిమా కోసం రగ్గుడ్ లుక్ లో మెగాస్టార్?

