విభిన్న తరహా సినిమాలు తీసే అతి కొద్దిమంది దర్శకులలో రవిబాబు ఒకరు. లో బడ్జెట్ లో ప్రేక్షకులను మెప్పించే సినిమాలను తీసాడు. చాలా లో బడ్జెట్ లో హై టెక్నికల్ వాల్యూస్ తో తీసి హిట్ అయిన హర్రర్ సినిమా ‘అవును’. ఇప్పటి వరకూ రాత్రి పూట మాత్రమే దెయ్యాలను చూపిస్తూ చేసిన హర్రర్ సినిమాలకు భిన్నంగా పగటిపూట దెయ్యాల్ని చూపిస్తూ చేసిన సినిమా ‘అవును’.
2012లో వచ్చిన ఈ హిట్ సినిమాకి సీక్వెల్ గా రవిబాబు ‘అవును 2’ని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై ‘అవును 2’ టైటిల్ ని కూడా ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేసారు. ఈ సినిమా మొదటి పార్ట్ లో నటించిన పూర్ణ, హర్షవర్ధన్ రాణేలు కీలక పాత్రల్లో నటిస్తారా లేక వేరే నటీనటులు నటిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా వివరాలను అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది.


