దసరాకి హీరోగా రానున్న పందిపిల్ల !
Published on Aug 19, 2018 9:36 am IST

టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు, చిన్న చిత్రాలతోనే మంచి హిట్స్ కొడతారు. ప్రస్తుతం ఆయన ‘అదుగో’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పందిపిల్ల కావడంతో ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం పై ఆసక్తి పెరుగుతూ వస్తోంది. పైగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో వస్తుండటంతో ‘అదుగో’ మీద మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం గతంలోనే సన్నాహాలు చేసింది. పోస్ట్ ప్రొడక్షన్స్ కారణాల వల్ల విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది.

కాగా తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు రవిబాబు, ఈ చిత్ర నిర్మాత సురేష్ బాబు ‘అదుగో’ చిత్రాన్ని ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు స్పష్టం చేశారు. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం కొత్తదనం కోరుకొన్నే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నెలా రూపొందింది. రవిబాబు కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook