
ఈ ఏడాది దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి రిలీజ్ అయిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘కేరింత’. ఈ సినిమా ద్వారా పలువురు కొత్త నటీనటులు పరిచయమయ్యారు. అందులో బాగా పేరు తెచ్చుకుంది మాత్రం.. శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను బాగా నవ్వించిన నూకరాజు పాత్ర చేసిన కుమార్ పార్వతీశం. కేరింతలో బాగా గుర్తింపు తెచ్చుకున్న కుమార్ పార్వతీశంకి మరో బంపర్ ఆఫర్ దక్కింది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించనున్న ‘ఎవడో ఒకడు’ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం కుమార్ పార్వతీశంని సెలక్ట్ చేసారు.
ఎవడో ఒకడు సినిమాలో రవితేజ ఓ లెక్చరర్ గా కనిపించనున్నాడు. అలాగే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రవితేజకి స్టూడెంట్ లా కనిపించనుంది. కుమార్ పార్వతీశం కూడా స్టూడెంట్ గా, అనుపమ పరమేశ్వరన్ కి బెస్ట్ ఫ్రెండ్ గా సినిమాకి కీలకమైన పాత్రలో కుమార్ పార్వతీశం కనిపిస్తాడు. వేణు శ్రీరాం దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఇటీవలే లాంచనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమాలో నటించబోయే మరో హీరోయిన్ ని అన్వేషిస్తూ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. దిల్ రాజు నిర్మించే ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తాడు.