మరోసారి రవితేజ ద్విపాత్రాభినయం.!

మరోసారి రవితేజ ద్విపాత్రాభినయం.!

Published on Apr 29, 2015 11:01 PM IST

Kick2
‘విక్రమార్కుడు’ సినిమాలో డబుల్ రోల్ చేసి ప్రేక్షకులను మెప్పించిన హీరో మాస్ మహారాజ రవితేజ. ఆ సినిమా తర్వాత మరోసారి మాస్ మాహారాజ రవితేజ డబుల్ రోల్ చేయనున్నాడు. ఇంతకీ ఏ సినిమా అని ఆలోచిస్తున్నారా.. 2009లో వచ్చి ఆడియన్స్ ని విపరీతంగా ఎంటర్టైన్ చేసిన కిక్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ‘కిక్ 2’ లో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. ‘కిక్ 2’ సినిమా మొదటి పార్ట్ అయిన కిక్ సినిమాలోని రవితేజ – ఇలియానాల వారసుడి చుట్టూ తిరుగుతుందని ఇది వరకే తెలియజేశాం.

కిక్ 2 లో రవితేజ తండ్రి – కొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. అందులో కొడుకు పాత్ర కోసం లుక్ మార్చుకొని చాలా స్లిమ్ అండ్ స్టైలిష్ గా అయ్యాడు. అలాగే తండ్రి పాత్ర కోసం కూడా తన లుక్ ని చాలా మార్చుకున్నాడని సమాచారం. తండ్రి కొడుకుల కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ఇందులో ఉన్నాయి. ఆన్ స్క్రీన్ పై ఒకేసారి ఇద్దరు రవితేజలు రెండు డిఫరెంట్ లుక్స్ లో చూసి ఆడియన్స్ ని థ్రిల్ అవుతారని ఈ చిత్ర టీం అంటోంది. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మే మిడిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు