వక్కంతం వంశీ దర్శకత్వంలో మాస్ రాజా ?

Published on Jul 1, 2018 2:58 pm IST

అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం తో దర్శకుడిగా పరిచియమయ్యారు వక్కతం వంశీ . ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. ఇక ఇప్పుడు ఆయన మరో స్టార్ హీరోను డైరెక్ట్ చేయనున్నాడని సమాచారం. ప్రస్తుతం రవితేజ కోసం కథను సిద్ధం చేస్తున్నాడట ఈ డైరెక్టర్.

ఇంతకుముందు రవితేజ నటించిన ‘కిక్ చిత్రానికి వంశీ కథను అందించాడు .ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అప్పటినుండి వంశీకి ఆయనతో మంచి అనుభందం ఏర్పడింది. ప్రస్తుతం రవితేజ శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన మరో రెండు చిత్రాలకు కమిట్ అయ్యాడు. ఈసినిమాలను పూర్తి చేసిన తరువాత రవితేజ వక్కతం వంశీ చిత్రంలో నటించే అవకాశాలు వున్నాయి .

సంబంధిత సమాచారం :