కొత్త సినిమా మొదలెట్టిన మాస్ మహారాజా !

Published on Apr 13, 2021 3:19 pm IST

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. క్రాక్ సినిమాతో ఈ ఏడాది ప్రారంభాన్ని సాలీడ్ హిట్ ను కొట్టి మంచి ఊపు మీద ఉన్నాడు. అందుకే ఇప్పుడు వరసగా సినిమాలని రవితేజ లైన్‌లో పెడుతున్నాడు. ఉగాది పండుగ సందర్భంగా శరత్ అనే కొత్త దర్శకుడితో రవితేజ కొత్త సినిమాని స్టార్ట్ చేశాడు. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

కాగా అక్కినేని నాగ చైతన్య నటించిన మజిలీ సినిమాలో ఒక హీరోయిన్‌గా నటించిన దివ్యాంశ కౌశిక్ రవితేజకి జంటగా ఈ సినిమాలో నటించబోతోంది. ఇక ఈ సినిమా ప్రారంభోత్వవం పూజా కార్యక్రమాలను ఈ రోజు ఘనంగా నిర్వహించారు. హీరో రవితేజ క్లాప్ కొట్టగా.. మైత్రీ మూవీస్ యలమంచిలి రవిశంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కాగా త్వరలో ఈ సినిమాకి పనిచేసే ఇతర టెక్నీషియన్స్ .. నటీ నటులను వెల్లడించనున్నారు. ఇక రవితేజ ప్రస్తుతం నటిస్తున్న ఖిలాడి సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

సంబంధిత సమాచారం :