రవితేజ ‘బలుపు’ చూపిస్తున్న ‘పవర్’ టీజర్..!

రవితేజ ‘బలుపు’ చూపిస్తున్న ‘పవర్’ టీజర్..!

Published on Aug 7, 2014 12:31 PM IST

Power
మాస్ మహారాజ్ రవితేజ మరోసారి క్లాస్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. లుక్ మాత్రమే క్లాస్, రవితేజ పెర్ఫార్మన్స్ మ..మా.. మాస్. మాస్ మహారాజ్ నటిస్తున్న తాజా సినిమా ‘పవర్’ టీజర్ ఈ రోజు విడుదలైంది. కేవలం అర నిముషం నిడివి గల ఈ టీజర్ అభిమానులతో పాటు సగటు సినిమా ప్రేక్షకుడిని మెప్పించింది.

ఎసిపి బలదేవ్ పాత్రలో మాస్ మహారాజ్ చేత ‘బలుపు’తో కూడిన మాస్ డైలాగులు చెప్పించారు దర్శకుడు కెఎస్ రవీంద్ర(బాబీ). టీజర్ లో ఒక్క సెకను కూడా వేస్ట్ చేయకుండా ఫుల్ ఫోకస్ మొత్తం హీరో మీద పెట్టారు. ‘పవర్’ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ డైలాగ్ డెలివరీ చాలా ఎఫెక్టివ్ గా ఉంది. సూపర్బ్. ‘బలుపు’ సినిమాకు ‘పవర్’ఫుల్ కథను అందించిన కెఎస్ రవీంద్ర(బాబీ), ‘పవర్’తో దర్శకుడిగా మారుతున్న సంగతి తెలిసిందే. టీజర్ చూస్తుంటే మాస్ మహారాజ్ అభిమానులకు విందు భోజనం గ్యారెంటీ అనిపిస్తుంది.

గతంలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించిన విక్రమార్కుడు, వెంకి(క్లైమాక్స్), కిక్ (క్లైమాక్స్) సినిమాలు సూపర్ సక్సెస్ సాదించాయి. సెంటిమెంట్ పరంగా చూసినా ‘పవర్’ సూపర్ హిట్ కావడం ఖాయమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. క్లాసు మాసు మిక్స్ చేసిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

రవితేజ సరసన హన్సిక, రేజీనా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.

‘పవర్’ టీజర్ చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

తాజా వార్తలు