టాలెంటెడ్ నటిపై షూట్ తో “క్రాక్” కంప్లీట్.!

టాలెంటెడ్ నటిపై షూట్ తో “క్రాక్” కంప్లీట్.!

Published on Oct 28, 2020 12:01 PM IST

ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా తన హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “క్రాక్”. పక్కా మాస్ పోలీస్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. దీనికి ముందు రవితేజ నటించిన “డిస్కో రాజా” పరాభవ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. ఆ రేంజ్ లో రవితేజ అండ్ టీం ఈ సినిమాపై అంచనాలు పెంచుకోగలిగారు.

ఇటీవలే ఫైనల్ షూట్ ను ఫుల్ స్వింగ్ లో స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు ఫైనల్ డే షూట్ కు వచ్చేసింది. అది మాత్రమే కాకుండా ఈ ఫైనల్ రోజు షూట్ ను ప్రముఖ టాలెంటెడ్ నటి వరలక్ష్మీ పై సీన్స్ తో కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టేసినట్టుగా చిత్ర దర్శకులు మరియు ఇతర యూనిట్ తెలిపారు. ఈమెపై షూట్ తో ముగించమని ఆమె ఒక అద్భుతమైన నటి అంటూ గోపీచంద్ కితాబిచ్చారు. అలాగే ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లోనే నిలపనున్నట్టుగా మరోసారి దర్శకుడు కన్ఫామ్ చేసేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు