అందంగా కనిపించానంటే కారణం ఆయనే – రవితేజ

అందంగా కనిపించానంటే కారణం ఆయనే – రవితేజ

Published on Jan 11, 2026 11:00 AM IST

Bhartha Mahasayulaku Wignyapthi

మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bhartha Mahasayulaku Wignyapthi) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్‌ వేడుకలో దర్శకులు హరీశ్‌ శంకర్‌, బాబీ, శివ నిర్వాణ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఫైట్లు కూడా హాస్యంగా, ప్రేక్షకులను నవ్వించేలా ఉంటాయన్నారు. తాను ఈ సినిమాలో అందంగా కనిపించానంటే అందుకు కారణం సినిమాటోగ్రాఫర్‌ ప్రసాద్‌ మూరెళ్లేనని తెలిపారు

రవితేజ ఇంకా మాట్లాడుతూ.. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా కొంతమంది దర్శకులతో కలిసి పని చేయడాన్ని తాను ఎంతో ఆస్వాదిస్తానని.. ముఖ్యంగా అనిల్‌ రావిపూడి, హరీశ్‌ శంకర్‌, బాబీ, కిశోర్‌ లాంటి దర్శకులతో పని చేయడం నాకు చాలా ఇష్టం అంటూ రవితేజ చెప్పుకొచ్చారు. కాగా ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ హయాతి కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు