‘స్పెషల్ 26’ పై ఆసక్తి చూపుతున్న రవితేజ

‘స్పెషల్ 26’ పై ఆసక్తి చూపుతున్న రవితేజ

Published on Nov 17, 2014 8:28 PM IST

ravi-teja
2013లో బాలీవుడ్ లో విడుదలైన ‘స్పెషల్ 26’ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాని సౌత్ ఇండియన్ అన్ని భాషల్లోనూ(తెలుగు, తమిళ్ , కన్నడ, మలయాళం) రీమేక్ చెయ్యడం కోసం తమిళ డైరెక్టర్ త్యాగరాజన్ రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అన్ని భాషల్లో ఈ సినిమాలో హీరోగా ఎవరు సరిపోతారా అని అన్వేషిస్తున్నారు.

తెలుగులో ఇప్పటికే పలువురు హీరోల పేర్లు వినిపించాయి. తాజాగా వారి లిస్టులో మాస్ మహారాజ రవితేజ పేరు కూడా చేరింది. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రవితేజ కూడా ఈ సినిమా రీమేక్ పై ఆసక్తి చూపిస్తుండడం. రవితేజ మాట్లాడుతూ ‘స్పెషల్ 26 రియలిస్టిక్ ఫిల్మ్. అక్షయ్ కుమార్ ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తుంటారు. ఇలాంటి సినిమాని నేను ట్రై చేసినా నా ఫ్యాన్స్ ఆదరిస్తారు. ఎందుకంటే వారు నా నుంచి కోరుకునే కామెడీ, చిన్న చిన్న ఫైట్స్ ఇందులో కూడా ఉంటాయి. కానీ స్పెషల్ 26 సెట్స్ పైకి వెళ్ళడానికి టైం పడుతుందని’ అన్నాడు.

ప్రస్తుతం రవితేజ ‘కిక్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిపోగానే సంపత్ నంది దర్శకత్వంలో ‘బెంగాల్ టైగర్’ సెట్స్ పైకి వెళ్తుంది. ఇది పూర్తయిన తర్వాత రవితేజ స్పెషల్ 26 చేసేందుకు రవితేజ ఆసక్తి చూపుతున్నాడు. కానీ నిర్మాత రవితేజ కోసం అప్పటి వరకు ఆగుతాడా.? లేక వేరే హీరో కోసం ట్రై చేస్తాడా అనేది తేలాల్సి ఉంది. స్పెషల్ 26 రీమేక్ కి రవితేజ సరిపోతాడని మీరు అనుకుంటున్నారా.? మీ కామెంట్స్ ని కింద తెలపండి..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు