మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు . రెండు రోజుల క్రితమే రవితేజ నటించిన నేల టిక్కెట్టు విడుదలవ్వగా ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వం లో తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో మూడు పాత్రల్లో నటిస్తున్నాడు .ఈ సినిమా తరువాత రవితేజ మరో రెండు చిత్రాలలో నటించనున్నాడు అందులో ఒకటి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తమిళ్ మూవీ తేరి రీమేక్ ఈ సినిమాలాంచ్ కూడా జరిగిపోయింది.
ఇక మరొక సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడ ఫెమ్ విఐ ఆనంద్ డైరెక్ట్ చేయనున్న సినిమాలో నటించనున్నాడు .ఈ సినిమాలో రవితేజ రెండు పాత్రల్లో నటించనున్నాడని సమాచారం. ఈ చిత్రానికి సంభందించిన వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది . రవితేజ వరుస సినిమాలు చేస్తుడడంతో అయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు .
