మాస్ మహారాజా రవితేజ హీరోగా, కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bhartha Mahasayulaku Wignyapthi) సినిమా రాబోతుంది. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం సెన్సార్ లాంఛనాలను పూర్తి చేసుకుని, యూ/ఏ సర్టిఫికేట్‌ను పొందిందని చిత్ర నిర్మాతలు ఈరోజు ప్రకటించారు. ఇక తాజా అప్ డేట్ ప్రకారం, ఈ సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాలు అని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఈ రన్‌టైమ్ చాలా ప్లస్ కానుంది.
ఇక ఈ సినిమాలో ‘డింపుల్ హయతి – ఆషిక రంగనాథ్’ పాత్రల మధ్య రవితేజ పాత్ర ఎలాంటి సమస్యలు పేస్ చేసింది అనే కోణంలో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయట. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13, 2026న రిలీజ్ కానుంది. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమాలో కామెడీ ఎలిమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి అని టాక్ ఉంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయం సాధిస్తోందో చూడాలి.


