రవితేజ సినిమా ఆగిపోయిందట ?

Published on Jul 19, 2018 8:26 am IST


మాస్ మహరాజ్‌ గా ఒకప్పుడు వరుసగా విజయాలు అందుకున్న రవితేజ, గతకొన్ని సినిమాలుగా పరాజయాలు చవిచూస్తున్నాడు. టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు చిత్రాలు బాక్స్ అఫీస్ వద్ద ఘోరంగా నిరాశ పరిచాయి. దాంతో రవితేజ్ స్పీడు తగ్గించినట్లు కనిపిస్తోంది. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలు లైన్లో పెట్టే రవితేజ్, ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్‌ అక్బర్ ఆంటోని చిత్రం ఒక్కటే చేస్తున్నాడు. దర్శకుడు శ్రీనువైట్ల ఈ చిత్రాన్ని ఎన్నో జాగ్రత్తలు తీసుకోని మరి తెరకెక్కిస్తున్నప్పటికీ ఈ చిత్రం పై అనుకున్నంతగా భారీ అంచనాలు లేవు.

అయితే సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో మాస్ మహరాజ్‌ రవితేజ్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసిందే. తమిళ్‌ స్టార్ విజయ్‌ నటించిన తేరి చిత్రాన్ని తెలుగు అనువాదంలో రవితేజ్ నటించడానికి ఒప్పుకున్నాడు. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ అనువాద చిత్రం ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే చిత్రబృందం నుంచి ఏ విషయం అయినది అధికారిక ప్రకటన రానుంది.

సంబంధిత సమాచారం :