రామ్ సినిమాలో రవితేజ హీరోయిన్ ?

22nd, March 2018 - 07:21:57 PM


రవితేజ ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్’ అనే సినిమా చేస్తున్నారు. అందులో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం పూర్తికాకముందే ఈమె మరొక మంచి ప్రాజెక్ట్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అదే ఎనర్జిటిక్ హీరో రామ్ కొత్త సినిమా.

హీరో రామ్ భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత ఆనంద్ ప్రసాద్ నిర్మాణంలో ఒక అడ్వెంచరస్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ చిత్రంలో కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన దర్శక నిర్మాతలు మాళవిక శర్మను ఖాయం చేశారని తెలుస్తోంది. అయితే ఈ వార్తపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అందలేదు. ఇకపోతే ఈ చిత్రాన్ని ఇటీవలే ‘గరుడవేగ’ చిత్రంతో హిట్ అందుకున్న ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేయనున్నారు.