రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ గ్లింప్స్ ఇటీవల విడుదలై, అభిమానులు మరియు విమర్శకుల నుండి అద్భుతమైన స్పందనను పొందింది. ఈ రోజు, చిత్ర బృందం ప్రేక్షకుల ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ సినిమాను 2026 ఆగస్టు 21న తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
అన్నట్టు, తమిళంలో ఈ చిత్రం ‘ఇరుముడికట్టు’ (Irumudikattu) పేరుతో విడుదల కానుంది. ఇక ‘కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి ఒక కథే ఈ ఇరుముడి. ఇందులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. కొత్త ప్రయాణంలో ఉత్సాహంగా ఉన్నా’’ అని రవితేజ ఆ మధ్య చెప్పుకొచ్చారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బేబీ నకాస్త్ర రవితేజ కుమార్తెగా నటిస్తోంది.



