ప్రస్తుతం కళ్యాణ్ క్రిష్ణ దర్శకత్వంలో మాస్ మాహారాజా రవితేజ ‘నేల టికెట్టు’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన ‘కందిరీగ’ చిత్ర దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం తమిళ స్టార్ హీరో విజయ్ చేసిన ‘తేరి’ సినిమాకు రీమేక్ గా రూపొందనుంది. అయితే ఇది ‘తేరి’ సినిమాకు పూర్తిస్థాయి రీమేక్ కాదట.
‘తేరి’ నుండి కేవలం లైన్ మాత్రమే తీసుకుని మిగతా కథ, కథనాల్ని మొత్తం తెలుగు నేటివిటీకి అనుగుణంగా రూపొందిస్తారట సంతోష్ శ్రీనివాస్. జూలై నెలలో మొదలుకానున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటించనున్న ఈ సినిమాలో క్యాథరిన్ థ్రెస కూడ ఒక కీ రోల్ చేయనుంది.


