రవితేజ..ఈ ప్రాజెక్ట్ కు బ్రేక్ పడిందా?

Published on May 21, 2020 3:00 am IST

ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ తన క్రేజీ కాంబో శృతి హాసన్ మరియు దర్శకుడు గోపీచంద్ మలినేనితో తెరకెక్కిస్తున్న చిత్రం “క్రాక్”. పవర్ ఫుల్ కాప్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి హైప్ ఉంది. ఇదిలా ఉండగా దీని తర్వాత మాస్ మహారాజ దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారని వార్తలు వచ్చాయి.

కానీ ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి కాస్త బ్రేక్ పడ్డట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి బడ్జెట్ అంశంలో చిన్న పాటి అవకతవకలు ఉండడంతో ఈ ప్రాజెక్ట్ అందాకా వాయిదా పడ్డట్టు తెలుస్తుంది. అలాగే ఈ ప్రొజెస్ట్ స్టార్ట్ అయ్యే వరకు కాస్త ఎక్కువ సమయమే పడుతుంది అని సమాచారం. అందుకే ఆ లోపు దీని స్థానంలో రవితేజ మరో ప్రాజెక్ట్ ను చెయ్యాలనే యోచనలో ఉన్నారని టాక్.

సంబంధిత సమాచారం :

X
More