‘బెంగాల్ టైగర్’ రన్ టైం డీటైల్స్

‘బెంగాల్ టైగర్’ రన్ టైం డీటైల్స్

Published on Dec 8, 2015 3:05 PM IST

bengal-tiger
మాస్ మహారాజ్ రవితేజ బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే కథతో రానున్న సినిమా ‘బెంగాల్ టైగర్’. ఇప్పటికే ట్రైలర్స్ తో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సెన్సార్ కూడా పూర్తి చేసుకొని ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమాకి ఫైనల్ రన్ టైంని లాక్ చేసింది. ఈ చిత్ర డైరెక్టర్ సంపత్ నంది ఒరిజినల్ గా మూవీ ఫస్ట్ హాడ్ 1 గంట 13 నిమిషాలు ఉంటె, సెకండాఫ్ 1గంట 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది అన్నాడు. అనగా యాడ్స్ తో కూడా కలుపుకొని సినిమా టోటల్ రన్ టైం 2 గంటల 26 నిమిషాలు ఉంటుందని తెలిపాడు.

ఈ మధ్య కాలంలో సినిమా బాగుంటే ఈ షార్ప్ రన్ టైమ్స్ సినిమాకి చాలా హెల్ప్ అవుతున్నాయి. అలానే ఈ రన్ టైం సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని సంపత్ నంది భావిస్తున్నారు. ఎజ మార్క్ హీరోయిజం సీన్స్ సినిమాకి చాలా హెల్ప్ అవుతాయని సమాచారం. రవితేజ సరసన అందాల భామలు తమన్నా, రాశీ ఖన్నాలు హీరోయిన్స్ గా కనిపించి ఆకట్టుకోనున్నారు. బొమన్ ఇరానీ, రావు రమేష్ లు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాని కెకె రాధామోహన్ నిర్మించాడు.

తాజా వార్తలు