వచ్చే నెలలో ‘అదిగో’ వచ్చేస్తుంది !

వచ్చే నెలలో ‘అదిగో’ వచ్చేస్తుంది !

Published on Aug 17, 2018 5:26 PM IST

వైవిధ్యమైన దర్శకుడిగా పేరు ఉన్న రవిబాబు ప్రస్తుతం ‘అదిగో’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరో పందిపిల్ల కావడంతో ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం మీద మంచి ఆసక్తి ఏర్పడింది. పైగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో వస్తుండటంతో ‘అదిగో’ మీద మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం గతంలోనే సన్నాహాలు చేసింది. కొన్ని కారణాల వల్ల విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తం మీద ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని తెలుస్తోంది.

ఈ నెలాఖరు నుండి ఈ చిత్ర ప్రమోషన్లు మొదలు పెట్టి వచ్చే నెలలో ‘అదిగో’ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం కొత్తదనం కోరుకొన్నే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుదట. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు