‘అమర్ అక్బర్ ఆంటోనీ’ లో రవితేజ ఎన్నిపాత్రల్లో నటిస్తున్నాడంటే ?

‘అమర్ అక్బర్ ఆంటోనీ’ లో రవితేజ ఎన్నిపాత్రల్లో నటిస్తున్నాడంటే ?

Published on Jun 20, 2018 11:06 PM IST


శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ .ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ అమెరికాలో శరవేగంగా జరుగుతుంది . తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్డేట్ అందుతుంధి . ఈ సినిమాలో రవితేజ మూడు పాత్రల్లో నటిస్తున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి .

కానీ చిత్ర వర్గాల నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం రవితేజ ఈ సినిమాలో ఓకే పాత్రలో నటిస్తున్నాడు కథ రీత్యా ఆ పాత్ర మూడు విభిన్న గెటప్పులలో కనిపిస్తుందని తెలుస్తుంది వరుస బ్లాక్ బస్టర్ విజయాలను ఖాతలో వేసుకున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడంతో ఈ చిత్రం ఫై మంచి అంచనాలు వున్నాయి . ఇక వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్న శ్రీను వైట్ల , రవితేజ కు ఈ సినిమా విజయం సాధించడం చాలా అవసరం .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు