“కల్కి” టీమ్ కి మాస్ మహారాజ కంగ్రాట్స్!

“కల్కి” టీమ్ కి మాస్ మహారాజ కంగ్రాట్స్!

Published on Jul 5, 2024 10:00 PM IST

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఎడి. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతున్న ఈ చిత్రం పై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఆ లిస్ట్ లోకి మాస్ మహారాజ రవితేజ చేరిపోయారు. ఈ చిత్రాన్ని చూసిన రవితేజ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇంటెన్స్ షూటింగ్ కారణంగా ఈ ఇతిహాసాన్ని చూడటానికి ఆలస్యం అయ్యింది. కానీ చివరకు కల్కి 2898ఎడి చిత్రాన్ని చూసాను. ఇంటెన్షన్ నుండి అమలు చేయడం మరియు అద్భుతమైన కళాఖండాన్ని అందించడం వరకు నాగ్ అశ్విన్ యొక్క స్పష్టత, నిబద్ధత మరియు దృష్టి సాటిలేనిది అని అన్నారు. స్వప్న దత్ , ప్రియాంక దత్ మరియు వైజయంతి ఫిల్మ్స్ టీమ్‌కి వారి నమ్మకం మరియు దానిని నిజం చేసినందుకు ధన్యవాదాలు. ప్రియమైన ప్రభాస్, అమితాబ్ బచ్చన్ సార్, కమల్ హాసన్ సార్ మరియు విజయం సాధించిన టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు