బ్యాంకాక్ లో మాస్ రాజా !
Published on Jun 12, 2018 8:21 pm IST

ఇటీవల నేల టిక్కెట్టు అంటూ ప్రేక్షకులను పలుకరించారు మాస్ మహారాజ్ రవితేజ. ఈ చిత్రం దారుణమైన ఫలితాన్నిఇచ్చింది.ఈ సినిమా తరువాత రవితేజ శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కోసం అయన యు ఎస్ వెళ్లనున్నాడు.ఈ మధ్యలో కాస్త టైం దొరకడంతో ఆయన ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అయన తన కూతురు మోక్షద , కుమారుడు మహాదన్ తో కలిసి బ్యాంకాక్ లో వున్నా ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది. మరో విశేషం ఏంటంటే ఈ వొకేషన్ కు రవితేజ తన పర్సనల్ స్టాఫ్ ను కూడా తీసుకెళ్లారు .

‘రాజా ది గ్రేట్’ సినిమా విజయం తరువాత’ టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు’ సినిమాలతో వరుస పరాజయాలను ఖాతాలో వేసుకున్నారు రవితేజ. ప్రస్తుతం అయన శ్రీను వైట్ల సినిమా తో పాటు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘తేరి’చిత్ర రీమేక్ లో అలాగే ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ ఫెమ్ వి ఐ ఆనంద్ తెరకేక్కించనున్న సినిమాలో నటించనున్నాడు.

 
Like us on Facebook