‘నోటంకి’ సాంగ్ షూటింగ్’లో రవితేజ, హన్సిక.

‘నోటంకి’ సాంగ్ షూటింగ్’లో రవితేజ, హన్సిక.

Published on Aug 12, 2014 6:17 PM IST

ravi-teja-hansika

‘పవర్’ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ పాడిన పాట ‘నోటంకి’. తమన్ స్వరపరిచిన ఈ మాస్ సాంగ్ ఇటివల విడుదలైన ‘పవర్’ ఆడియోలో హిట్ సాంగ్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో జరుగుతుంది. రవితేజ, హన్సికలపై ఈ పాటను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ చాలా సరదాగా జరుగుతుందని హన్సిక వ్యాఖ్యానించింది. మొదట ‘పవర్’ను ఆగస్ట్ 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సాంగ్ షూటింగ్ బాలన్స్ ఉండడం, ఎన్టీఆర్ ‘రభస’ అదే రోజు విడుదల కానుండడంతో సెప్టెంబర్ 5కు వాయిదా వేశారు.

రవితేజ సరసన రెజినా సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్రలో నటించారు. ‘బలుపు’ కధా రచయిత కెఎస్ రవీంద్ర(బాబీ) ‘పవర్’తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కన్నడ నటుడు, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమాను చాలా లావిష్ గా, రిచ్ గా తెరకెక్కించారు. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సందడి చేయనున్నారు. టీజర్లు, ఫస్ట్ లుక్ ప్రోమోస్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

తాజా వార్తలు