మాస్ రాజా రవితేజ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi)సంక్రాంతి కానుకగా ఈ నెల 13న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రంతో రవితేజ చాలా రోజుల తర్వాత తన జోనర్ మార్చుకున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే, తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంటైర్‌నింగ్ కంటెంట్‌తో నింపేశారు. ఇద్దరు భామల మధ్య సతమతమయ్యే పాత్రలో రవితేజ రిఫ్రెషింగ్ రోల్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఆయన నుంచి ఇటీవల మిస్ అయిన కామెడీ టైమింగ్ కూడా మనకు ఈ ట్రైలర్‌లో చూపెట్టారు. ఇక ఈ ట్రైలర్‌లో మరో హైలైట్ అయిన పాత్ర సత్య చేశారు. ఆయన నుంచి రాబోయే కామెడీ సీక్వెన్స్‌లు ఈ సినిమాకే హైలైట్‌గా నిలవబోతున్నాయని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ తమ పర్ఫార్మెన్స్‌లతో పాటు గ్లామర్ డోస్‌తో ప్రేక్షకులకు ట్రీట్ ఇవ్వనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారనుంది. వెన్నెల కిషోర్, సునీల్, మురళీధర్ గౌడ్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.


